
ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా పెరవలి ముక్కామల శాఖా గ్రంధాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ... బుధవారం పుస్తక ప్రదర్శన డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ముక్కామల యూనియన్ బ్యాంకు మేనేజర్ బాలాంతరపు చైతన్య మాస్టర్ దాసరి రామకృష్ణ పాల్గని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ ... గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని తెలిపారు. వెంకటపతి మాట్లాడుతూ ... విద్యార్థులకు ఆహారపు అలవాట్లు డ్రగ్స్ ప్రభావం ఆరోగ్యం మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ గ్రంథాలయ అధికారి సూర్యనారాయణ, కొంపల్లి పట్టాభిరామం, మద్దిపాటి సత్యం, కే.గంగాధరం, ఏడిద సత్యనారాయణ, శేషారావు, కే.సోని సర్వేశ్, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, గ్రంథాలయాధికారులు ఎం.వెంకటేశ్వర్లు, కె.వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.