Nov 17,2022 14:20

ప్రజాశక్తి-చాపాడు(కడప) : కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో గ్రంథాలయ అధికారి జే.శివశంకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ నాయకుల జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ.. 55వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు మహాత్మా గాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, భగత్‌ సింగ్‌ తదితర జాతీయ నాయకుల గురించి వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. 6 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ నెల 19న బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి నాగలక్ష్మి, టీచర్లు ప్రసన్న, షహనాజ్‌ బేగం, సుప్రజ, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.