
ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) : 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఏడిద రోడ్డులోని శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఉపాద్యాయులు ఎం.సత్యవతి రామాయణం, మహాభారతం, భాగవతం చిన్న చిన్న కథలు విశేషాలతో కూడిన పుస్తకాలు చదవడం ద్వారా పుస్తక పరిజ్ఞానం, సమాజం పట్ల అవగాహన పెంచుకోవచ్చునన్నారు. గ్రంథాలయాధికారి ఎన్. బాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.