Aug 24,2023 13:22

ప్రజశక్తి - చీరాల (బాపట్ల) : చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 శాటిలైట్‌ ఘనవిజయంలో భాగంగా శాస్త్రవేత్తలను అభినందిస్తూ పట్టణంలోని పాపరాజుతోటలో ఉన్న రాఘవేంద్ర పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గవిని మణి కుమార్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారస్థంభం సెంటర్లో కేక్‌ కటింగ్‌ చేసి సంబరాలు నిర్వహించారు. భారతదేశ ఖ్యాతిని పెంచిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.