Jun 22,2023 14:29

ప్రజాశక్తి-నరసరావుపేట(పల్నాడు) : మండల కేంద్రం రొంపిచర్ల గ్రామంలో గోగులపాడు రోడ్డులో గల కేరళ మోడల్‌ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు నవోదయ విద్యకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ గెల్లి.గాలిరెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన నవోదయ ప్రవేశ పరీక్షలో తమ పాఠశాలకు చెందిన పోలిశెట్టి త్రినాథ్‌, నారే కీర్తి, అంగలూరి శ్రీభవ్య, తోడేటి అభిషేక్‌లు ఉత్తీర్ణులైయ్యారని తెలిపారు. ఈ విధంగా తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం నవోదయ పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ మార్కులు రావటానికి, విద్యార్థులు ఎంపికకు కృషిచేస్తున్న ఉపాధ్యాయులును ప్రిన్సిపాల్‌ గాలిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా నవోదయ విద్యకు ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.