ప్రజాశక్తి-నరసరావుపేట : నియోజకవర్గ టిడిపి ఇంచార్జి చదలవాడ అరవిందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రకాష్ నగర్‌లోని తన ఇంటివద్ద చదలవాడ అరవిందబాబు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో అరవిందబాబును బలవంతంగా ఎత్తుకుని ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించారు.