Aug 08,2023 15:39

ప్రజాశక్తి - పల్నాడు : జిల్లా వ్యాప్తంగా కౌమార దశ బాలికలలో ఉన్న రక్త హీనత శాతాన్ని తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా బడిలో చదువుతున్న బాలికలు, బడి బయట ఉన్న బాలికలను గుర్తించి వారిలో ఉన్న రక్తహీనత సమస్యను గురించడంతో పాటుగా వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించి, పౌష్ఠికాహారం అందించడం ద్వారా సరైన మందులు అందించి బాలికల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి రక్త హీనత ను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.