హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేదని హైకోర్టు ఇప్పటికే ప్రిలిమ్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించి కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో దీనికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి ఓయూ ఠాణాకు తరలించారు.