Jun 05,2023 07:58

నూతన తరం రచయితలను, అనువాదకులను తయారు చేయాలన్న సంకల్పంతో జూన్‌ 24, 25 తేదీల్లో సమన్విత, సేఫ్‌, జి.ఆర్‌.కె - పోలవరపు సాంస్క ృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా చిన ముత్తేవిలో కథా కార్యశాల నిర్వహిస్తున్నాం. ఆసక్తి గల యువ రచయితలు, రచయిత్రులూ ఈనెల 10వ తేదీ తమ పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యశాలకు హాజరు కావొచ్చు. ప్రముఖ రచయత ఖదీర్‌ బాబు, ఇతర సీనియర్‌ రచయతల సారథ్యంలో కథారచనపై శిక్షణ ఉంటుంది. ఈ కార్యశాల అనంతరం ప్రతినిధులు రాసే కథలతో ఒక సంకలనం వెలువరిస్తాం. ఈ కార్యశాలకు వచ్చేవారు రూ.100 ప్రవేశ రుసుం చెల్లించాలి. రెండు రోజులూ భోజనం, వసతి ఏర్పాట్లు ఉంటాయి. మరిన్ని వివరాలకు శాంతిశ్రీ 8333818985, శమంతకమణి 9491962638, ఉషారాణి 9492879210 లను సంప్రదించాలి.
- సమన్విత