కొంగ ఒకటి ఉంది
ఆటలాడుకుంది
ఆడిపాడి ఆకలైంది
చెరువు చేరుకుంది
ఒంటి కాలిపై నిల్చుంది
చేప కొరకు చూసింది
దగ్గరకొక్కటీ రాకుంది
వేచి వేచి చూస్తుంది
కప్ప కొంగను చూసింది
ఎందుకిలా నిలబడింది?
తేరిపార చూసింది
దొంగ జపము దేనికంది?
దొంగ జపము కాదిది
తెలియకే కాలు లేస్తుంది
మనిషి కళ్ళు కొట్టినట్లు
సహజంగా జరుగుతుంది
రెండు కాళ్ళు ముంచితే
శరీరం చల్ల చల్లగౌతది
శరీర వేడి సమతుల్యతకే
ఒంటి కాలి జపమన్నది
చేప దరికి చేరింది
ముక్కు నీట ముంచింది
చేప దొరికి పోయింది
గుటుక్కుమని మింగింది
నన్ను దొంగ జపమనకు
మాంసాహారమే తినేది
ప్రకృతి నేర్పిన ధర్మమిది
దానిననుసరించుటే విధి
- ఆవుల చక్రపాణి యాదవ్
99633 50973










