
వంటగదిలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. అల్లంలో సహజ యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా జీర్ణక్రియను పెంచుతుంది. కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమం ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. అధిక బరువును తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్‌ను నియంత్రించడమే కాకుండా, కండరాల్లో నొప్పికి, జలుబు, దగ్గులకు ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న అల్లాన్ని ఎక్కువ రోజులపాటు ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం.
చాలా మంది అల్లాన్ని ఫ్రిడ్జ్‌లలో స్టోర్ చేస్తారు. అలా చేస్తే అల్లం త్వరగా ఎండిపోతుంది. ఫ్రిడ్జ్‌లోనే కాకుండా.. బయట కూడా అల్లాన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు.
ఫ్రిడ్జ్‌లో నిల్వ ఇలా :
గాలి చొరబడని ఓ జిప్ కవర్‌లో గానీ, కంటైనర్స్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే అల్లం ఎండిపోదు.
కట్ చేసిన అల్లం ముక్కలు నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా గాలి చొరబడని డబ్బాలో పెట్టి, నిల్వ చేసుకోవచ్చు.
బయట నిల్వ ఇలా :
అల్లంని టిష్యూ పేపర్ లేదా నార్మల్ పేపర్‌లో అయినా చుట్టి జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు.
అల్లాన్ని ఎండలో ఎక్కువగా ఉంచకుండా.. చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.
నిల్వ చేసేటప్పుడు అల్లం తడిగా ఉండకూడదు. బాగా ఆరిపోవాలి.
అల్లం తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి వెనిగర్, పంచదార నీరు కలిపిన మిశ్రమంలో ఉంచినా త్వరగా పాడవ్వదు.
ఒక చిన్న మట్టిపాత్రలో ఇసుక వేసి, తేమగా చేసి, అందులో అల్లం నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.