Oct 28,2023 08:16

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టును విస్తరిస్తుందని, ఆ పనులను వెంటనే నిలిపివేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇరిగేషన్‌ ఇఎన్‌సి మురళీధర్‌ కెఆర్‌బిఎం చైర్మన్‌కు శుక్రవారం లేఖ రాశారు. భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తి గుమ్మగట్ట, రాయదుర్గం, డి.హిరేహల్‌, కనెకల్‌ మండలాల పరిధిలోని 58 మధ్యతరహా ట్యాంకులను నింపేందుకు ఎపి ప్రభుత్వం టెండర్లు పిలిచిందని ఇఎన్‌సి తెలిపారు. ఈ పనులకు అపెక్స్‌ కౌన్సిల్‌, సిడబ్ల్యుసి నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.