Sep 25,2023 20:48

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో చైనా నుండి భారత్‌ దిగుమతి చేసుకున్న ఉక్కు ఎగుమతులు ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. గడిచిన ఏప్రిల్‌-ఆగస్టు సమయంలో చైనా భారతదేశానికి రెండవ అతిపెద్ద ఉక్కు ఎగుమతిదారుగా ఉంది. 0.8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులను విక్రయించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 69 శాతం పెరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు చైనా ఎక్కువగా కోల్డ్‌ రోల్డ్‌ కాయిల్‌ లేదా షీట్‌లను భారత్‌కు ఎగుమతి చేసింది. ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో భారత్‌ 2.5 మిలియన్‌ టన్నుల ఫినిష్డ్‌ స్టీల్‌ను దిగుమతి చేసుకుంది.