Aug 14,2023 15:18

ప్రజాశక్తి- పాలకొల్లు (పశ్చిమగోదావరి) : భీమవరంలో జరిగిన యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ అఫ్‌ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాలకొల్లు యూనిట్‌కు అత్యున్నత ఆల్‌ రౌండ్‌ పెర్ఫార్మన్స్‌తో ఉత్తమ అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా పాలకొల్లు యూనిట్‌ కార్యదర్శి భీమేశ్వరరావును రాష్ట్ర శాఖ హాస్టల్‌ డెవలెప్మెంట్‌ కమిటీ మెంబర్‌గా నామినేట్‌ చేశారు. పాలకొల్లు యూనిట్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌.కెఎస్పిఎన్‌ వర్మ రాష్ట్ర శాఖ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పాలకొల్లు యూనిట్‌ చైర్మన్‌ కారుమూరి సూర్యనారాయణ 2023 - 2026 ఏపీ రాష్ట్ర శాఖ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. ఈ సందర్భంగా వీరిని పాలకొల్లు యూత్‌ హాస్టల్స్‌ సభ్యులు అభినందించారు.