Nov 19,2022 11:48

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18 న జరిగిన మండల స్థాయి చెకుముకి పొటీల్లో సెయింట్‌ జాన్స్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వీరిలో ఏ.మేఘనశర్మ, పి.సత్య నాగ చైతన్య, బి.గ్రీస్మతా గెలుపొందారు. విజేతలను పాఠశాలలో శనివారం అభినందించారు. స్కూల్‌ డైరెక్టర్‌ బత్తుల నోబల్‌ కుమార్‌, కరస్పాండెంట్‌ బత్తుల అనురాధ, ప్రిన్సిపల్‌ శైలజా, సహ ఉపాధ్యాయులు అభినందించారు.