
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లిలోని యూనిక్ రోలర్ స్కేటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన 7వ అంతర్ యూనిక్ రోలర్ జిల్లా స్థాయి పోటీల్లో కశింకోట సెయింట్ జాన్స్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో 5 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 8 కాంస్య పతకాలు గెలుపొందారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బత్తుల నోబుల్ కుమార్, కరస్పాండెంట్ బత్తుల అనురాధ, ప్రిన్సిపాల్ రూపనంద, అకాడమీ ఇన్ చార్జి చంద్రమౌళి, సహా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.