Jul 03,2023 07:03

ప్రతిష్టాత్మక కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం 2022కు గాను పి శ్రీనివాస్‌ గౌడ్‌ రచించిన చిన్ని చిన్ని సంగతులు సంపుటి ఎంపికైనట్టు అవార్డు నిర్వాహకులు శ్రీ కొత్తపల్లి సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పి.శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. కవిత్వానికి, కథలకు పలు పురస్కారాలు అందుకున్నారు. విడి ఆకాశం, రెక్కల పతాక, కథాపురి, కథాప్రకాశం సంకలనాలకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. త్వరలో అనంతపురంలో అవార్డు ప్రదానోత్సవ సభ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.