Aug 01,2023 12:08

అనంతపురం : బకాయి వేతనాలను చెల్లించాలంటూ ... అనంతపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద శ్రీరామ్‌ రెడ్డి, శ్రీ సత్యసాయి వాటర్‌ వర్కర్స్‌ సంయుక్తంగా మంగళవారం ధర్నా నిర్వహించారు. బకాయి వేతనాల కోసం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, తదితర సమస్యలను పరిష్కరించాలని.. నేటి నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్షలను ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబులు ప్రసంగించారు.