ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండల నూతన తహశీల్దారుగా శుక్రవారం హరికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తహశీల్దారుగా విధులు నిర్వర్తించిన నారాయణస్వామి అనారోగ్య కారణాలతో లాంగ్ లీవ్ పెట్టి వెళ్లడంతో నార్పల ఇన్చార్జి తహశీల్దారుగా డిప్యూటీ తహశీల్దార్ సురేష్ బాబుకు బాధ్యతలు అప్పగించారు. గత రెండు నెలల క్రితమే నార్పల తహశీల్దారుగా బదిలీ అయిన హరికుమార్ కొన్ని అనివార్య కారణాలవల్ల కలెక్టరేట్‌లో లీవ్ కాకపోవడంతో అక్కడే విధులు నిర్వహించారు. అన్ని అడ్డంకులను తొలగించుకొని నార్పల తహశీల్దారుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ హరి కుమార్ కు సి ఎస్ డి టి రాజశేఖర్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ జ్యోతి రాణి, తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగులు, వీఆర్వోలు, పలువురు ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, పాత్రికేయులు కలిసి నూతన తహశీల్దార్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరికుమార్ మాట్లాడుతూ ... అందరి సమన్వయంతో రెవెన్యూ సేవలు మండల ప్రజలకు మరింత చేరవయ్యే విధంగా చేస్తూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.