ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : ఆత్మహత్య చేసుకుంటానంటూ ... ఆర్ఎంపి డాక్టర్ సెల్‌టవర్ ఎక్కిన ఘటన సోమవారం పుట్లూరు మండలంలో జరిగింది.
కొంతకాలం క్రితం ఆర్ఎంపి డాక్టర్ వెంకటేష్‌కు లక్కీగా కారు తగిలిందని ఓ గుర్తింపు లేని ఫోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. దీంతో ఆ కారు కోసం డాక్టర్ పలు దఫాలుగా రూ.16 కట్టాడు. ఆ తరువాత నుండి అవతలి వ్యక్తుల నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న డాక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన డబ్బులను రికవరీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ... ఈరోజు ఉదయం పుట్లూరు మండలంలోని ఏ.కొండాపురంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. తన డబ్బులను రికవరీ చేస్తామని పోలీసులు హామీ ఇస్తేనే సెల్ టవర్ దిగివస్తానని ... లేదంటే ఆత్మహత్యే పరిష్కారం అని ఆర్ఎంపి డాక్టర్ వెంకటేష్ అన్నారు.