Jan 19,2023 12:08

విజయవాడ : గత 8 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘పుస్తక పురస్కారాలు’ ఈ సంవత్సరం కూడా ప్రదానం చేయాలని మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్‌ సాహితీ పురస్కారాల నిర్వాహక కమిటీ నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ క్రింద పేర్కొన్న పురస్కారాల కోసం  రాష్ట్రేతర/ ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితలు ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానించారు. 

  • 1) శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం (రచయితచే 2022లో ప్రచురించబడిన కథా సంపుటికి)
  • 2) ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం (కవిచే 2022లో ప్రచురించబడిన కవితా సంపుటికి)
  • 3) డా॥ కె వి రావు సాహితీ పురస్కారం (రచయితచే 2020/2021/2022 లలో ప్రచురింపబడిన పుస్తకం)

(ఏ ప్రక్రియ అయినా మినీ కవితలు, దీర్ఘకవితలు, బాల సాహిత్యం, వ్యాసాలు, గజల్స్‌.. తదితరములు)

ఇందుకు గాను రచయితలు తమ పుస్తక ప్రచురణలను మూడేసి (3) ప్రతులను  ఈ క్రింది చిరునామాకు ది. 28-02-2023 లోపుగా పంపవలసి వుంటుందని తెలిపారు. పురస్కార గ్రహీతలు ఒక్కొక్కరికి రూ. 7,000/- నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సన్మానింపబడుదని వెల్లడించారు. 

  • పుస్తకాలు పంపవలసిన చిరునామా :

డా॥ మక్కెన శ్రీను టి.ఎఫ్‌.3, బొడ్డపాటి మాన్షన్‌, బైబిల్‌ స్కూల్‌ ఎదురు, గుణదల, విజయవాడ,  కృష్ణాజిల్లా-520 004.

చరవాణి : 98852 19712