Aug 29,2023 18:47

ఆసియాకప్‌-2023లో పాల్గొనే శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు ప్రకటించింది. శ్రీలంక క్రికెట్‌బోర్డు జట్టు ప్రకటించిన జట్టులో ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగకు చోటు దక్కలేదు. అతడు గాయం నుంచి కోలుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. శ్రీలంక ప్రిమియర్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లు, పరుగులు చేసిన హసరంగ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటే. ఇక పేసర్‌ ఛమీర, మధుశంక, లాహిరు కుమారలకు చోటు దక్కింది. గాయాల నుంచి కోలుకున్న ఫెర్నాండో, ప్రమోద్‌ మధుశన్‌లకూ చోటు దక్కింది. రెండేళ్ల తర్వాత కుశాల్‌ పెరీరాకు వన్డేలో చోటు దక్కడం విశేషం. శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా దుశన్‌ శనక, వైస్‌ కెప్టెన్‌గా కుశాల్‌ మెండీస్‌ వ్యవహరించనున్నారు. ఇక ఆగస్టు 30నుంచి సెప్టెంబర్‌ 17వరకు ఆసియాకప్‌ టోర్నీ జరగనుంది.
జట్టు: శనక(కెప్టెన్‌), నిశంక, కరుణరత్నే, పెరీరా, మెండీస్‌(వైస్‌ కెప్టెన్‌), అసలంక, ధనుంజయ, సమర విక్రమ, తీక్షణ, వెల్లలగే, పథీరణ, రజిత, హేమంత, ఫెర్నాండో, మధుశన్‌.