Aug 15,2023 15:52

కొలంబో: ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ వానిందు హసరంగా టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌ చెప్పాడు. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు అందుకు వర్క్‌లోడ్‌ తగ్గించుకొనేందుకు టెస్ట్‌ క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. టి20ల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన హసరంగ.. శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సి) చైర్మన్‌కు మంగళవారం రిటైర్మెంట్‌ లేఖను పంపించాడు. అతని రిటైర్‌మెంటును అంగీకరించినట్లు లంక క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఈ విషయంపై ఎస్‌ఎల్‌సీ సీఈవో యాష్లే డి సిల్వ ఓ ప్రకటనలో.. 'మేం హసరంగ రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో టీం వైట్‌బాల్‌ ప్రోగ్రాంలో కీలకమైన ఆటగాడిగా ఉంటాడని భావిస్తున్నాం' అని తెలిపారు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన హసరంగా.. నాలుగు టెస్టులే ఆడాడు. 2021లో బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు.