Sep 26,2023 21:25
  • మధుశంక, కుమారకు చోటు
  • గాయంతో హసరంగ దూరం
  • వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన బోర్డు

కొలంబో: భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5నుంచి జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు మంగళవారం వెల్లడించింది. 15మంది ఆటగాళ్ల శ్రీలంక బృందానికి దసున్‌ శనక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణకు చోటు దక్కగా.. స్టార్‌ స్పిన్నర్‌ హసరంగ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అలాగే దుష్మంత్‌ ఛమీర కూడా భుజం గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో లేడు. శ్రీలంక జట్టు వన్డే ప్రపంచకప్‌కు ముందు 29న బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.
జట్టు: శనక(కెప్టెన్‌), కుశాల్‌ మెండీస్‌(వైస్‌ కెప్టెన్‌), పెరీరా, నిస్సంక, కరుణరత్నే, సమరవిక్రమ, అసలంక, ధనుంజయ, హేమంత, తీక్షణ, వెల్లలగే, రజిత, పథీరణ, లాహిరు కుమార, మధుశంక.
రిజర్వు: ఛమిక కరుణరత్నే.