Sep 13,2023 12:51

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : క్రీడలు మానసిక వికాసానికి తోడ్పాటును ఇస్తాయని మండల విద్యాశాఖ అధికారి నాయుడు రామచంద్రరావు, మండల అభివృద్ధి అధికారి ఐదం రాజులు అన్నారు. బుధవారం స్థానిక ఎస్‌.వి.ఎస్‌.ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ... క్రీడలు చదువునకు అదనపు అర్హత అన్నారు. అనంతరం అండర్‌ 14, 17 విభాగాలలో కబడ్డీ, కోకో, బాల్‌ బ్యాట్మెంటన్‌, టెన్నికోయిట్‌, అథ్లెటిక్స్‌, షెటిల్‌, తదితర క్రీడల్లో క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్‌.నాగకుమార్‌, ముంగర వెంకటరాజు, విశ్రాంత ఉపాధ్యాయులు గెడా శ్రీనివాసరావు, వివిధ పాఠశాలల పీడీలు పాల్గొన్నారు.

/Sports-help-in-mental-development-Mandal-Education-Officer