Nov 09,2023 11:41

పెదబయలు (అల్లూరి) : పెదబయలు ఫొటోస్‌ రాష్ట్ర వైద్యాశాఖ జెడి జి.జనార్థన్‌ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ వైద్య శాఖ గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక పర్యవేక్షణ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డ్స్‌ పేషెంట్స్‌ ఓపి పరిస్థితి పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ... రాష్ట్ర వ్యాప్తంగా జనాభా నియంత్రణ (కుటుంబ నియంత్రణ) లో వివాహ వయసు పొడిగించుకోవాలని అన్నారు. అవగాహనా లోపంతో చిన్నప్పుడే వివాహలై అనారోగ్యానికి తల్లి బిడ్డలు గురవుతున్నారని చెప్పారు. వివాహ అనంతరం పిల్లల్ని కనడానికి బిడ్డకు బిడ్డకు మధ్య దూరాన్ని పాటించాలని తెలిపారు. పిల్లలు ఇక చాలు అనుకొంటే కుటుంబ నియంత్రణ చేసుకోవాలని లేదా హంతర ఇంజిక్షన్‌ ద్వారా మూడు నెలలకు పిపియుసిడి ఒక ఇంజక్షన్‌ వేయించుకోవాలన్నారు లేదా దగ్గర ఉన్న మందులు వినియోగించాలన్నారు. అపోహల మధ్య తల్లి బిడ్డల ఆరోగ్యం పాడవుతుందని గర్భం రాకుండా ఛాయా మాత్రలు నిరోధ్‌లు వినియోగించాలన్నారు. వెంటవెంటనే పిల్లలను కనకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నారు. గర్భవతులు హాస్పిటల్స్‌ లో మాత్రమే డెలివరి చేయించుకోవాలని, తల్లి బిడ్డ ఆరోగ్యం పై అందుబాటులో ఉన్న వైద్యుల దగ్గరకెళ్లి పరీక్షించుకోవాలన్నారు. ఈనెల 21 నుండి డిసెంబర్‌ 4 వరకు వేసేక్టమి కార్యక్రమంలో ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకొని కుటుంబ నియంత్రణ చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిందూరం, పడల్‌ ఎంపీ హెచ్‌ఓ జర్ర వెంకట రావు, సిబ్బంది పాల్గొన్నారు.