Jul 25,2023 19:30

వరంగల్‌ : జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గత 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 14వ డివిజన్‌, ఏనమాముల నగర్‌లో లోతట్టు వరద ప్రాంతాలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నగర మేయర్‌ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రిజ్వాన్‌ భాషా, స్థానిక కార్పొరేటర్‌, అధికారులతో కలిసి పరిశీలించారు.బాధితులతో మాట్లాడి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గే వరకు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వరద సహాయక తక్షణ చర్యలు చేపట్టాలని, అధికారులు నిరంతరం సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.