Jul 27,2023 18:15

నిర్మల్‌ : భారీ వర్షాలకు నిర్మల్‌ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్‌ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వర్ఱ ప్రాజెక్ట్‌ ను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రాజెక్ట్‌ ఇన్‌ ప్లో అండ్‌ అవుట్‌ ప్లో పై నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..ఆయా ప్రాజెక్ట్‌ లోకి భారీ వరదలు వస్తుండటం వల్ల ముందే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్‌ ల పరివాహక ప్రాంత పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో వరదల సందర్భంగా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.