Sep 17,2023 15:36

మద్నూర్‌ : ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ హాయంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నారని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కృషి అందిస్తున్నారని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే పేర్కొన్నారు. డోంగ్లి సింగిల్‌ విండో నూతన భవనం దుకాణ సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల నిధులతో నిర్మించిన వాటిని ఆదివారం నాడు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు సిండే ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారికి మండల ప్రజా ప్రతినిధులు అంతా ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డోంగ్లి సింగిల్‌ విండో చైర్మన్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ రామ్‌ పటేల్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్ పటేల్‌ మద్నూర్‌ మండల ఎంపీపీ వాగుమారే లక్ష్మీబాయి వైస్‌ ఎంపీపీ జైపాల్‌ రెడ్డి డోంగ్లి గ్రామ సర్పంచ్‌ మహాదేవి జుక్కల్‌ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో గల సింగిల్‌ విండోల చైర్మన్లు ఉమ్మడి మద్నూర్‌ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు ఇరు మండలాల బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు శశాంక్‌ పాటిల్‌ బన్సీ పటేల్‌ సింగిల్‌ విండో డైరెక్టర్లు స్థానిక తహసీల్దార్‌ డోంగ్లి సింగిల్‌ విండో కార్యదర్శి గంగాధర్‌ కార్యాలయ సిబ్బంది నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు డోంగ్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.