ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మానవ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతి జిల్లాలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఈ విభాగాలను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎస్‌పి స్థాయి అధికారి ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర అడిషనల్ డిజి పివి సునీల్‌కుమార్ ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులతో మానవ అక్రమ రవాణా విభాగాల ఏర్పాటు, నిర్వహణ వంటి అంశాలపై శుక్రవారం మాట్లాడారు. జిల్లాల్లో మానవ అక్రమ రవాణా నియంత్రణపై పనిచేసే ఎన్‌జిఒల సహకారంతో ఈ విభాగం పనిచేయాలని సూచించారు. మానవ అక్రమ రవాణా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.










