మిణుగురు మిణుగురు మిణుగురులు
మినుకు మినుకు మిలమిలలు
తొలకరి వెలుగుల తారకలు
భువికి దిగివచ్చిన సారికలు !
మిణుగురులు వెలుగుల పురుగులు
చీకటిలో మైమరిపించే వెలుగు జిలుగులు
అబ్బురపరిచే రంగుల వెలుగులు
అవనిపై వాలిన పాలపుంతలు!
ఎగిరే రెక్కల దీపాలు
గాలికి ఆరని దీపికలు
భూదేవికి ఇచ్చే హారతులు
వెలిగే మలిగే కాంతులు
మిణుగురులు పొందిన వరాలు!
చీకటిదారుల చిరు దివ్వెలు
చలికాలపు ఆశల చలి కుంపట్లు
మిణుగురులు ఇచ్చే అమూల్య వెలుగులు
వెంటపడుదురు వెలుగులేని ఈర్ష్యపరులు!
పువ్వులోని పరిమళాలు
మిణుగురులోని మినుకు మినుకులు
ఆస్వాదించే మనసుకే ఆనందం
మిణుగురులతో ఆడే బాల్యం భాగ్యమే !
- పి. బక్కారెడ్డి
97053 15250










