న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకితో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మారుతి కార్లను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆ బ్యాంక్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎండి, సిఇఒ మురళి రామ క్రిష్ణన్ పాల్గొన్నారు.










