
- మార్క్‌క్రమ్ ఒంటరి పోరాటం
- పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఆవిరి
చెన్నై: ఐసిసి వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసునుంచి పాకిస్తాన్ దూరమైంది. సెమీస్ రేసులో నిలవాలంటే దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు వికెట్ తేడాతో ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు 46.4ఓవర్లలో 270పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 47.2ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 271పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపులో దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తొలుత కెప్టెన్ బాబర్ అజామ్(50), సౌద్ షకీల్(52) మాత్రమే అర్ధ శతకాలతో రాణించారు. షాదాబ్ ఖాన్(43) ఫర్వాలేదనిపించాడు. తొలుత ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(9), ఇమామ్ అల్ హక్(12) శుభారంభం అందించలేకపోయారు. వీరిద్దరినీ జెన్సన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత బాబర్, మహ్మద్ రిజ్వాన్ (31) మధ్య చక్కటి పార్ట్‌నర్ షిప్ దొరికింది. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద రిజ్వాన్‌ను కొయిట్జీ బోల్తాకొట్టించి పెవిలియన్‌కు పంపాడు. ఇఫ్తికార్ అహ్మద్ (21)తో కలసి బాబర్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరి భాగస్వామ్యం భారీ స్కోరువైపు వెళ్తోంది అనుకునేలోపే 12 పరుగుల తేడాతో ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. ఈ రెండు వికెట్లు షంసీ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత షాదాబ్ ఖాన్, సౌద్ షకీల్ జట్టును భారీ స్కోరు వైపు తీసుకెళ్లారు. షాట్‌లతో షాదాబ్ విరుచుకుపడితే, సౌద్ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ ఇద్దరూ కీలక సమయంలో ఔటైపోయారు. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ నవాజ్ (24) కొన్ని భారీ షాట్లు కొట్టినా... లోయర్ ఆర్డర్ నుంచి సరైన సహకారం అందలేదు. దీంతో పాక్ 270 పరుగులకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రైజ్ షంసీ 4 వికెట్లు, మార్కో జాన్సన్ 3 వికెట్లు, గెరాల్డ్ కొయిట్జీ 2, లుంగి ఎంగిడి ఒక వికెట్ తీశారు.
ఛేదనలో భాగంగా దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ డికాక్ (24), బవుమా(28) నిరాశపరిచారు. డుస్సెన్(21), క్లాసెన్(21), డేవిడ్ మిల్లర్(29) నిరాశపరచడంతో దక్షిణాఫ్రికా జట్టు 206పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. చివర్లో విజయానికి 9పరుగుల దూరంలో ఉండగా సపారీజట్టు 9వికెట్లు కోల్పోయి దశలో ఉత్కంఠ నెలకొంది. చివర్లో కేశవ్ మహరాజ్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. దక్షిణాఫ్రికా గెలుపులో మార్క్‌క్రమ్(91) టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాంసీకి లభించింది.
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
ఆస్ట్రేలియా × న్యూజిలాండ్
(వేదిక: ధర్మశాల; ఉ.10.30గం||లకు)
నెదర్లాండ్స్ × బంగ్లాదేశ్
(వేదిక: కోల్‌కతా; మ.2.00గం||లకు)
స్కోర్‌బోర్డు..
పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి)ఎన్గిడి (బి)జాన్సెన్ 9, ఇమామ్-ఉల్-హక్ (సి)క్లాసెన్ (బి)జాన్సెన్ 12, బాబర్ అజమ్ (సి)డికాక్ (బి)షాంసీ 50, రిజ్వాన్ (సి)డికాక్ (బి)కొర్ట్జే 31, ఇప్తికార్ అహ్మద్ (సి)క్లాసెన్ (బి)షాంసీ 21, షౌద్ షకీల్ (సి)డికాక్ (బి)షాంసీ 52, షాదాబ్ ఖాన్ (సి)మహరాజ్ (బి)కొర్ట్జే 43, నవాజ్ (సి)మిల్లర్ (బి)జాన్సన్ 24, షాహిన్ అఫ్రిది (సి)మహరాజ్ (బి)షాంసీ 2, మహ్మద్ వాసిం జూనియర్ (సి)డికాక్ (బి)ఎన్గిడి 7, హరీస్ రవూఫ్ (నాటౌట్) 0, అదనం 19. (46.4ఓవర్లలో ఆలౌట్) 270పరుగులు. వికెట్ల పతనం: 1/20, 2/38, 3/86, 4/129, 5/141, 6/225, 7/240, 8/259, 9/268, 10/270. బౌలింగ్: జాన్సెన్ 9-1-43-3, ఎన్గిడి 7.4-0-45-1, మార్‌క్రమ్ 4-0-20-0, మహరాజ్ 9-0-56-0, కొర్ట్జే 7-0-42-2, షాంసీ 10-0-60-4.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి)షౌద్ షకీల్ (బి)మహ్మద్ వాసిం జూనియర్ 28, డికాక్ (సి)మహ్మద్ వాసిం జూనియర్ (బి)షాహిన్ అఫ్రిది 24, డుస్సెన్ (ఎల్‌బి)ఉస్మా మిర్ 21, మార్‌క్రమ్ (సి)బాబర్ (బి)ఉస్మా మీర్ 91, క్లాసెన్ (సి)ఉస్మా మిర్ (బి)మహ్మద్ వాసిం జూనియర్ 12, డేవిడ్ మిల్లర్ (సి)రిజ్వాన్ (బి)షాహిన్ అఫ్రిది 29, జాన్సెన్ (సి)బాబర్ (బి)హరీస్ రవూఫ్ 20, కొర్ట్జే (సి)రిజ్వాన్ (బి)షాహిన్ అఫ్రిది 10, మహరాజ్ (నాటౌట్) 7, ఎన్గిడి (సి అండ్ బి)రవూఫ్ 4, షాంసీ (నాటౌట్) 4, అదనం 21. (47.2 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 271పరుగులు. వికెట్ల పతనం: 1/34, 2/67, 3/121, 4/136, 5/206, 6/235, 7/250, 8/250, 9/260 బౌలింగ్: ఇప్తికార్ అహ్మద్ 3-0-23-0, షాహిన్ అఫ్రిది 10-0-45-3, మహ్మద్ నవాజ్ 6.2-0-40-0, హరీస్ రవూఫ్ 10-0-62-2, మహ్మద్ వాసిం జూనియర్ 10-1-50-2, ఉస్మా మీర్ 8-0-45-2.