- సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సిందే
వాషింగ్టన్ : ప్రముఖ సామాజిక మీడియా దిగ్గజం ట్విట్టర్ (ఎక్స్) యూజర్లకు వాత పెట్టనుంది. ప్రతి వినియోగదారుడూ నెలకు సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ వెల్లడించారు. మస్క్ సబ్‌స్క్రిప్షన్ ఫీజును అమలు చేయనున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహుతో జరిగిన భేటీలో మస్క్ తెలిపారు. ఎక్స్‌ను వాడే వారు ప్రతినెలా ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఎంత మొత్తమనేది ఆయన వెల్లడించలేదు. ఎక్స్‌లో ప్రస్తుతం 55 కోట్ల నెలవారి వినియోగదారులు ఉండగా.. రోజుకు సగటున 10-20 కోట్ల పోస్టులు పెడుతుంటారన్నారు. ప్రస్తుతం బ్లూటిక్ సబ్‌స్రిప్షన్ అయినా ఎక్స్ ప్రీమియం కోసం ప్రతినెలా రూ.900 వసూలు చేస్తోంది. త్వరలోనే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లేనివారి నుంచి కూడా ఛార్జ్ వసూలు చేయాలనేది ఎలన్ మస్క్ నిర్ణయంగా ఉంది. అదే జరిగితే ఎక్స్ వాడకం దారులు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.