
గుంటూరు : నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో మామపై అల్లుడు దాడికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం కోర్టు వాయిదాకు హాజరైన సమయంలో జరిగిన ఘర్షణలో బైకు తాళం చెవితో మామ చెవిపై అల్లుడు బలంగా పొడవడంతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని నగరంపాలెం సిఐ హైమారావు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.