Aug 03,2023 15:32

సోమాలియా : ఓ అథ్లెటిక్‌ శిక్షణ తీసుకోకుండానే మైదానంలో పరుగుపెట్టింది. ఈ విచిత్రమైన సంఘటన తాజాగా చైనాలో జరిగింది. ఆ అథ్లెట్‌ పేరు నస్రా అబుకర్‌ అలి (20). ఆమె అథ్లెట్‌గా శిక్షణా తీసుకోకుండానే.. ఇటీవల చైనాలో జరిగిన స్టూడెంట్స్‌ గేమ్స్‌లో పాల్గొంది. ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో ఆ మహిళా స్పింటర్‌ 100 మీటర్లు 21 సెకన్ల గేమ్స్‌లో పాల్గొని ఓ అథ్లెట్‌గానే 100 మీటర్ల రేస్‌లో నిలబడింది. మిగతా అథ్లెట్స్‌ మాదిరిగానే ఆమె కూడా ఈ గేమ్‌లో పాల్గొని 11.58 సెకన్లపాటు పరుగెత్తింది. ఆ తర్వాత ఆమె పరుగెత్తలేక వెనుకబడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై సోమాలియా జాతీయ ఒలింపిక్‌ కమిటీతో విచారణలో జరిపామని, నస్రా అబుకర్‌ క్రీడాకారిణి కాదని తేలిందని క్రీడాశాఖా మంత్రి మొహమ్మద్‌ బర్రే మొహమ్మద్‌ తెలిపారు. దీంతో మొహమ్మద్‌ సోమాలియా అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ని పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'సోమాలియా అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ ఖదీజో అడెన్‌ దాహిర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బంధుప్రీతికి చోటిచ్చారని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ వేదికపై సోమాలియా దేశం పేరును కించపరిచే చర్యలకు పాల్పడ్డారు గనుక ఖదీజో అడెన్‌ను ఛైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.