Sep 08,2023 15:42

ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్యజిల్లా) : బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని కరెంట్‌ కాలనీలో గత కొంతకాలంగా లోఓల్టెజ్‌ సమస్య తలెత్తుండడంతో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి దృష్టికి కాలనీ వాసులు ఈ సమస్యను తీసుకువెళ్లారు. తక్షణం స్పందించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డి సంబంధిత అధికారులకు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో పలమనేరు పరిశీలకులు మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్‌ అహ్మద్‌ కాలనీలో విద్యుత్‌ స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్‌ను కూడా ఏర్పాటు చేయించారు. దీంతో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌ రెడ్డికి, విద్యుత్‌ శాఖ ఏఈ గిరిధర్‌కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.