Jan 26,2023 15:17

ప్రజాశక్తి-రాంబిల్లి (అనకాపల్లి) : సమస్యలు పరిష్కరించాలని నేవీ మెయిన్‌ గేటు ఎదుట 88 రోజులుగా నిరసన తెలుపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ 8 గ్రామాల నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. శారద, వరాహ, నదులలో వేటకు వెళ్లి తమ జీవనాన్ని కొనసాగించే వాళ్ళమంటూ నేవీలో వెళ్లకుండా గేట్లు మూసేసి తమ ఉపాధి లేకుండా చేశారంటూ 8 గ్రామాలు నిర్వాసితులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వివి రమణమూర్తి రాజు(కన్నబాబు)18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి 14 వేల 300 రూపాయలు ఇప్పిస్తానని అదే విషయాన్ని కలెక్టర్‌తో మాట్లాడతానని చెప్పిన ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే మరింత ఉదృతం చేస్తామంటూ హెచ్చరించారు.