ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : విద్యార్థుల ప్రాథమిక విద్య ప్రక్రియలో భాగంగా చతుర్విధ బోధనను అమలు చేస్తూ వారి నైపుణ్యాన్ని సులభంగా వెలికి తీయవచ్చునని టీచింగ్ ఎట్ ది రైట్ లెవెల్ శిక్షణ, ప్రదం సంస్థ (టిఏఆర్‌ఎల్) రాష్ట్ర పరిశీలకులు వినోద్ కుమార్ అన్నారు. కరోనా తర్వాత వెనుకబడిన విద్యార్థుల ఉన్నతికి మండలంలో ఎంపిక కాబడి ఇప్పటికే శిక్షణ పొందుతున్న చింతలూరు, పినపళ్ళ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను అధికారి శనివారం సందర్శించి పరిశీలించారు. విద్యార్థులందరూ తాము ఇప్పటివరకు నేర్చుకున్న విషయాలను, కఅత్యాలను ప్రదర్శించారు. దీనిపై రాష్ట్ర పరిశీలకులు ఉపాధ్యాయులకు తగు సూచనలు సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, సీఆర్పీలు గంటి శ్రీను, కుమారిలు పాల్గొన్నారు.