మెక్సికో : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మెక్సికన్ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి టియోకల్టిచే నగరంలో ఈ సంఘటన జరిగిందని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్‌లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారనీ, ఈ సమయంలో కొంతమంది దుండగులు తుపాకులు పట్టుకుని వచ్చి.. విచక్షణరహితంగా కాల్పులు జరిపారని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. మారావిల్లాస్ పరిసరాల్లోని బార్‌లో పలువురు వ్యక్తులు కాల్పులు జరిపారనీ.. ఈ సంఘటనలో ఆరుగురు మరణించారని పేర్కొంది. వాస్తవానికి నాలుగు మరణాలను అధికారులు నివేదించారు.. అయితే, ప్రాసిక్యూటర్లు నిన్న (శనివారం) ఆరుగురు మరణించినట్లు ధృవీకరించారు.