
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఒడెన్సె(డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ సూపర్‌ా500లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరిన ఏకైక మహిళా షట్లర్ పివి సింధు శనివారం స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన సెమీస్ పోటీలో సింధు 18-21, 21-19, 7-21తో మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. తొలి గేమ్‌ను పోరాడి ఓడిన సింధు.. రెండో గేమ్‌ను చేజిక్కించుకొని పుంజుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు ఆశించినస్థాయిలో రాణించలేక ఓటమిపాలైంది. చైనా షట్లర్ల మధ్య జరిగే మరో సెమీస్‌లో 3వ సీడ్ చెన్-యుఫీ 21-18, 21-12తో 8వ సీడ్ హన్-యుపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది.