
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఓడెన్సె(డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగియగా.. మహిళల సింగిల్స్‌లో పివి సింధు, ఆకర్షీ కశ్యప్ తొలిరౌండ్‌లో విజయం గెలిచారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-10, 16-21తో వెంగ్-హోంగ్-యంగ్(చైనా) చేతిలో పోరాడి ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్ సుమారు గంటా 14నిమిషాలసేపు సాగింది. మరో సింగిల్స్‌లో లక్ష్యసేన్ 16-21, 18-21తో వాంగ్‌ఛరోన్(థారులాండ్) వరుససెట్లలో ఓడాడు. ఇక పురుషుల డబుల్స్ నుంచి చిరాగ్ శెట్టిాసాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి వైదొలగడంతో సింగపూర్ జోడీకి వాకోవర్ లభించింది. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 21-14, 18-21, 21-10తో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన గిల్మోర్‌పై చెమటోడ్చి నెగ్గింది. మరో సింగిల్స్‌లో ఆకర్షీ కశ్యప్ 10-21 21-20, 21-12తో యొన్నే లీ(జర్మనీ) పై సంచలన విజయం సాధించి రెండోరౌండ్‌లోకి దూసుకెళ్లింది.