
ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్యజిల్లా) : దసరా మహౌత్సవాల సందర్భంగా నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో మేస్త్రి నరేంద్ర విజేతగా నిలిచి మొదటి బహుమతి 225 గ్రాముల వెండి వస్తువులను గెలుచుకున్నాడు. ఈ డ్రా కార్యక్రమానికి ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ద్వితీయ బహుమతి వాషింగ్ మిషన్‌ను ఎల్లంపల్లి సుధీష్ణ, తృతీయ బహుమతి రిఫ్రిజిరేటర్‌ను మస్తాన్, నాలుగో బహుమతి 25 గ్రాముల వెండి శంకు చక్రాలు నిచ్చెన మెట్ల గురుప్రసాద్‌లు గెలుచుకున్నారు. అలాగే 30 మందికి కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్స్ బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాధవి, వైసీపీ నాయకులు హిమగిరి నాథ్ యాదవ్, విజయుడు, ఆలయ అధ్యక్ష, ఉపాధ్యక్షులు యంబలూరు నరసింహస్వామి, మాకం వెంకట కుమార్, చలపాటి నరసింహ శ్రేష్టి, కార్యదర్శి గెలివి నాగ సురేంద్ర కుమార్, సంయుక్త కార్యదర్శులు యంబలూరు నరసింహ ప్రసాద్, మంచి కంటి నారాయణ, మహిళా మండలి అధ్యక్ష, ఉపాధ్యక్షులు గెలివి జయలక్ష్మి, చలపాటి మాధవి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.