
ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని చెముడులంక శివారు గాంధీనగర్ మండల పరిషత్ పాఠశాలలో ఉత్తమ ప్రతిభా పాటవాలను కనబర్చిన విద్యార్థిని కె.లావణ్యకు దాత బహునూతుల శ్యామ్ సుందర్ మంగళవారం నూతన సైకిల్‌ను బహుకరించారు. మరో ఐదుగురు ఉత్తమ విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ మాట్లాడుతూ ... ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టే దాతలైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ప్రతి ఒక్కరు కూడా వారి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకారాన్ని అందించాలన్నారు. ఇందుకు తన శాయశక్తుల అభివృద్ధి చేస్తూ ఇప్పటికే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నామన్నారు. నాడు, నేడు ద్వారా స్కూళ్లు అభివఅద్ధి జరుగుతుందన్నారు. ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేరవేస్తూ అర్హులైనవారిని లబ్ధిదారులుగా చేస్తున్నామన్నారు. శ్యామ్ తన సహకారాలు కూడా అందించి మరింత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎంసి చైర్మన్ బర్రా వీరబాబు, వైఎస్‌ఆర్సిపి పార్టీ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు(బులిరెడ్డి), దొండపాటి చంటి, మోటూరి సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.