
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు సుధా నారాయణమూర్తి దంపతులు శ్రీవారికి భారీ విరాళం సమర్పించారు. శ్రీవారికి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం సమర్పించారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఈఓ ధర్మారెడ్డికి బంగారు శంఖం అందజేశారు. దాదాపు రెండు కేజీల బంగారంతో తయారు చేయించిన శంఖం విలువ కోటిరూపాయలు ఉంటుందని సమాచారం.