Jan 15,2023 16:03
  •  బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : ఉపాధ్యాయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్రాంతి కానుకగా బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. 2,3 రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. కౌన్సెలింగ్‌ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయ సంఘాలతో మంత్రులు హరీష్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భేటీ సందర్బంగా బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇందుకు తగినట్టు మంత్రులు కార్యచరణను రూపొందిచనున్నారు.