Sep 24,2023 11:39

జార్జియా : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. జార్జియా అట్లాంటాలోని ఓ షాపింగ్‌ మాల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం) అట్లాంటాలోని షాపింగ్‌ మాల్‌లోకి ప్రవేశించిన సాయుధుడు యువకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు బాధితులు చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడించారు. కాల్పుల గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతుల్లో ఒకరికి 17, మరోకరికి 20, మూడో వ్యక్తికి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని చెప్పారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదుచేసిన దర్యాప్తు చేస్తున్నామన్నారు.