వరల్డ్‌కప్‌కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐసీసీ ఈవెంట్ కి దూరయ్యే పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే మ్యాచ్‌లో అతని చేతికి గాయం అయ్యింది. ట్రావిస్ హెడ్ హ్యాండ్ ఫ్యాక్చర్ అయ్యింది. దీంతో, మ్యాచ్ మధ్యలో హెడ్ రిటైర్డ్ హెడ్‌గా వెనుదిరిగాడు. అయితే, ఆ గాయం త్వరగా తగ్గితే తప్ప, ఆయన మళ్లీ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటికే స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్ వెల్ వంటి స్టార్లు కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడతున్నారు. ఇంత మంది గాయాల బారినపడటం, ఆసిస్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది.










