ప్రజాశక్తి - బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీదారు టార్క్ మోటార్స్ గంటూరులో తమ మొదటి ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను తెరిచినట్లు తెలిపింది. దీన్ని అమరావతి రోడ్‌లో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇక్కడ అమ్మకాలు, సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. ఇది రాష్ట్రంలోనే తొలి భౌతిక అవుట్‌లెట్ అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఒ కపిల్ పేర్కొన్నారు. నగరంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై పెరుగుతున్న ఆసక్తిని తీర్చడానికి ఈ అవుట్‌లెట్ దోహదం చేయనుందన్నారు.










