Mar 16,2023 21:25

మధురై : వస్త్రాలు, పాదరక్షల కోసం దారాలు, నిర్మాణాత్మక విడిభాగాల తయారీలో ఉన్న కోట్స్‌ మధురైలో తమ నూతన, అత్యాధునిక సస్టెయినిబిలిటీ కేంద్రాన్ని తెరిచినట్లు తెలిపింది. తమ స్పిన్నింగ్‌, ట్విస్టింగ్‌ పైలెట్‌ ప్లాంట్‌ వద్ద దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇది రీసైకిల్డ్‌ మరియు పునరుత్పాదక మెటీరియల్స్‌ దిశగా మారడాన్ని కూడా వేగవంతం చేయనుందని తెలిపింది. రాబోయే ఐదు ఏళ్లలో హరిత సాంకేతికతలను, మెటీరియల్స్‌ను అభివఅద్ది చేయడం కోసం 10 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టడం ద్వారా తమ సస్టెయినబిలిటీ లక్ష్యాలను చేరుకోవాలనే లక్ష్యంలో ఇది భాగమని కోట్స్‌ గ్రూప్‌ సిఇఒ రాజీవ్‌ శర్మ పేర్కొన్నారు.